కోటి వృక్షార్చనలో పాల్గొనండి… ఎన్నారైలకు ఎంపీ సంతోష్ పిలుపు

141
mp santhosh
- Advertisement -

ఎంపీ సంతోష్‌కమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గంటలో కోటి మొక్కలు నాటే లక్ష్యంతో కోటి వృక్షార్చనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ బృహత్‌ యజ్ఞానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సీఎం కేసీఆర్‌జన్మదిన కానుకగా ప్రతి ఒక్కరూ కోటి వృక్షార్చనలో భాగం తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అద్వ్యరములో ప్రపంచ వ్యాప్తంగా వున్నా అన్ని దేశాల తెరాస కార్యకర్తలతో , అభిమానులతో కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .

ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ గారు పాల్గొన్నారు, ముఖ్య అతిధి ఎంపీ జోగినపల్లి సంతోష్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరినీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. యాప్‌ కోసం వాట్సప్‌ నుంచి 9000365000 నెంబర్‌ కు GIC అని మెసేజ్‌ చేయాలి. యాప్‌ లింక్‌తో కూడిన మెసేజ్‌ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫొటోలను ఎవరికి వారు అప్‌లోడ్‌ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలోనూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు విశేష స్పందన వస్తున్నది. మీరు అన్ని దేశాలలో మీ వంతు ప్రయత్నాంగ కెసిఆర్ గారికి చెట్లు నాటి మీ అభిమానాన్ని చాటుకోవాలని తెలిపారు ,రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ కోరారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వచించిన మహేష్ బిగాల గారు మాట్లాడుతూ కెసిఆర్ గారి జన్మదిన సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ అభిమానులు పాలుపంచుకొంటున్నారు , ఈ సందర్బంగా ‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని సీఎం కేసీఆర్‌గారి ఆకాంక్ష. ఆయన ఆశయాన్ని నెరవేరుద్దాం. ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా చేపట్టబోతున్న కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి..సీఎంగారికి జన్మదిన కానుకగా అందిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా వున్నా అన్ని తెరాస శాఖలను అయన విజ్ఞప్తి చేసారు మీ సమయం అనుకూలంగా మొక్కలను నటి మీ అభిమానినని చాటుకోవాలని అన్నారు , అతి తక్కువ సమయములోనే మా కోరికను మన్నించి వచ్చిన సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు , ఈ కార్యక్రములో ప్రతక్షంగా రాజకుమార్ శానబోయిన , మేడసాని నరేందర్ రెడ్డి , ఆన్లైన్ లో UK నుంచి అనిల్ కూర్మాచలం , ఆస్ట్రేలియా నుంచి కాసర్ల నాగేందర్,న్యూజీలాండ్ నుంచి జగన్ వాడ్నలా . డెన్మార్క్ నుంచి శం బాబు ఆకుల , సౌత్ ఆఫ్రికా నుంచి నాగరాజు గుర్రాల,ఒమాన్ నుంచి మహిపాల్ రెడ్డి, బహరేన్ నుంచి సతీష్ రాధారపు,కువైట్ నుంచి అభిలాష , జర్మనీ నుంచి అరవింద్ మరియు మిగితా దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -