సీఎం కేసీఆర్‌ బర్త్ డే..తెలంగాణకు పండుగ రోజు: హరీశ్ రావు

142
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది…. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుందన్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు.

గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని తెలిపిన హరీశ్‌…తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తుందన్నారు. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని వెల్లడించారు.

- Advertisement -