మరోసారి పెద్ద మనసు చాటుకున్న ఎంపీ సంతోష్‌..

564
mp santhosh
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్య సభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని దేవనార్ ఫౌండేషన్‌కి తన వంతకు సాయంగా రూ. 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ రాజకీయ నాయకుడు అన్న పదానికి కొత్త భాష్యం చెబుతున్నారు సంతోష్. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పూర్తితో గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమాన్ని చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 4 కోట్లకు పైగా మొక్కలునాటారు.

అంతేగాదు ఇటీవలె మరుగుదొడ్డి సదుపాయం లేక మహబూబాబాద్ జిల్లాలో ఇబ్బందిపడుతున్న బాలికల సౌకర్యం కోసంఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి తక్షణమే తన ఎంపీలాడ్స్ నిధుల నుండి కావలసిన నిధులను మంజూరు చేశారు. తాజాగా దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి చేయూత నివ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

mp santhosh kumar

- Advertisement -