సుకుమార్ కథకు ఓకే చెప్పిన నిఖిల్..!

322
sukumar nikhil

అర్జున్ సురవరం తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో నిఖిల్. ఈ మూవీకి కథ- స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తుండగా ప్రజెంటర్ అల్లు అరవింద్ కాగా బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను ఇవాళ అనౌన్స్‌చేశారు దర్శకుడు సూర్యప్రతాప్.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు. నిఖిల్ కార్తికేయ-2 తాజా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి రానుంది.

గతంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా చేశాడు సుకుమార్. ఇక సుకుమార్-సూర్యప్రతాప్ కలిసి కుమారి 21 ఎఫ్ సినిమా చేశారు. మొత్తంగా ఈ క్రేజీ కాంబో తెరపైకి రానుండటం చర్చనీయాంశంగా మారింది.

Hero Nikhil confirms Sukumar Story…Hero Nikhil confirms Sukumar Story…Hero Nikhil confirms Sukumar Story