దిశ హత్య…అర్జున్ రెడ్డి దర్శకుడిపై విమర్శలు

629
Sandeep Reddy Vanga

దిశ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దుండగులను శిక్షించాలని పార్లమెంటులోనూ ఎంపీలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్నారు. ఆడపిల్లలపైహత్యలు చేసే వారిని వెంటనే ఉరి తీసేలా ఒక చట్టం తీసుకురవాలి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈసందర్భంగా దిశ హత్యపై పలువులు సెలబ్రెటీలు కూడా ట్వీట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దిశ ఘటనపై స్పందించాడు. సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి నేరస్తుల్లో వణుకు పుట్టించాలి. పాశవిక శిక్షలతో అడ్డుకోవాలి.. ప్రస్తుతం దేశంలోని ప్రతి అమ్మాయికి భరోసా కావాలి అని ట్వీట్ చేశాడు.

అయితే సందీప్ రెడ్డి ట్వీట్ కు చాలా మంది నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. నువ్ తీసిన సినిమాల్లో ఆడవాళ్లపై హింసను చూపించి, ఇప్పుడు నీతులు చెబుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ స్పందిస్తూ.. ‘నువ్వు చెబుతున్న ఆ భయం.. నీ సినిమాలో ఆమెను కొట్టకుండా అడ్డుకోగలిగిందా? అని ట్వీట్ చేశారు. అమ్మాయి నచ్చితే ఆమె అనుమతి లేకపోయినా ముద్దుపెట్టుకోవచ్చు, ఒళ్ళో పడుకోవచ్చు,డ్రెస్ తీయమని కత్తితో బెదిరించొచ్చు,నాకోరిక తీర్చు, ప్రేమ అని మాట్లాడకు,లాంటి సైకో ఆలోచనలతో సినిమా తీసిన మీరు కూడా నీతులు చెప్తే ఎలా భయ్యా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Netizens Fire On Arjun Reddy Director Sandeep Reddy Vanga On Disha Issue..