నవనీత్ కౌర్‌కు కరోనా..క్షీణించిన ఆరోగ్యం!

297
navneet
- Advertisement -

సినీ నటి,అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్దితి క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరిన నవనీత్ ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు వైద్యులు.

ఆగస్టు 6న నవనీత్ భర్త రవిరానాకు కరోనా పాజిటివ్ రాగా తర్వాత కుటుంబంలోని 12 మంది కరోనా బారీన పడ్డారు. దీంతో తమను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తిచేశారు నవనీత్.

నవనీత్‌ కౌర్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. కొద్ది రోజుల కిందట రవి రానాను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. రవి రానా బద్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

- Advertisement -