మోడీ,రాహుల్‌పై పోటీ చేద్దాం.. పసుపు బోర్డు ఎలా రాదో చూద్దాం…

289
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ బహిరంగ సభ నేడు నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాలతో గెలిపించుకున్నాం. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల గురించి దేశమంతా ఆలోచన జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు.

డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు సాధించుకుని.. మన నాయకుడిని గెలిపించుకున్నాం. ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసి ఉన్నం.అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానాలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్ లో నిధులు కేటాయించారు.సాధారణంగా ఎన్నికల్లో వాగ్దానం చేస్తే..ఐదేళ్లలో ప్రభుత్వాలు మెల్లమెల్లగా పనులు పూర్తి చేస్తాయి.కానీ సీఎం కేసీఆర్ అన్ని పనులను వేగవంతంగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారని అన్నారు.

MP Kavitha

పేదలకు ఇల్లు ఇచ్చేంతవరకు విశ్రమించనని హామీనిస్తున్నట్లు చెప్పారు. పసుపు బోర్డు సాధించే వరకు ప్రయత్నాలు ఆపనన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు పసుపు బోర్డు సాధన ఏమైందని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. జక్రాన్ పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో పంటల ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు స్థాపిస్తాం. డ్వాక్రా గ్రూప్ లను రైతుల పంటలతో అనుసంధానిస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

57 ఏళ్ల వయస్కులకు వృద్ధాప్య పింఛన్లు అమలు చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నం. బీడీ కార్మికుల ఓట్లు టీఆర్ఎస్ కు పడాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి గా రూ.3వేలు ఇస్తామని హామీనిచ్చాం. నిరుద్యోగ భృతి కింద బడ్జెట్ లో రూ.2800 కోట్లు కేటాయించారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి 40 వేలకుపైగా పూర్తి చేశాం. పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించగలిగామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెయ్యి రూపాయల పింఛన్ ను రూ.2 వేలకు పెంచుతామని చెప్పినం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రూ.2 వేల పింఛను ప్రారంభమవుతుంది. మే 1న లబ్ధిదారుల ఖాతాల్లో 2 వేల పింఛను జమ అవుతదని ఎంపీ కవిత తెలిపారు.

- Advertisement -