బీజేపీ, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌..

227
CM KCR Speech
- Advertisement -

సీఎం కేసీఆర్‌ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చేరిగారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచింది. సమైక్యపాలకుల పుణ్యమని నిజాంసాగర్ ఎండిపోయేది. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో..నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ అన్నారు. 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి. దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని కోరుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏం జరుగుతుందో చెప్పా..ఏం జరగాలో చెప్పా. దీంతో కొందరి పీఠాలు కదిలిపోతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధికారంలో పథకాల పేర్లు మారతాయే తప్ప ప్రజల తలరాతలు మారవని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కనుక అధికారంలోకి వస్తే ఒక్క పని మాత్రం కచ్చితంగా చేస్తాయి.. కాంగ్రెస్ వస్తే జహహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేరుతో, అదే, బీజేపీ అధికారంలోకి వస్తే, దీన్ దయాళ్, శ్యాంప్రసాద్ ముఖర్జీల పేర్లతో పథకాలు మాత్రం పెడతారని విమర్శించారు. ఈ పథకాలతో ప్రజల తలరాతలు మారవని, వారికి మంచి చేయరని, ఈ దేశంలో ఇప్పటి దాకా జరగాల్సింది జరగలేదని విమర్శించారు.

ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం తెలియజేశారు. పెన్షన్లు బాగా పెంచుకున్నాం. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఎర్రజొన్న రైతులు సరైన ధర రావడం లేదని బాధపడుతున్నారు. ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను టీఆర్ఎస్సే తీర్చింది. మంది మాటలు పట్టుకుని ఎర్రజొన్న రైతులు ఆగం కావొద్దు. మీతో ధర్నాలు చేయించిన మనుషులు తర్వాత మీతో ఉండరని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు.

- Advertisement -