ఎలక్షన్ రిపోర్ట్: ఈ మూడు చోట్ల ‘బాద్ షా’ లే?

42
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో నియోజిక వర్గాల ఏ పార్టీకి ఎంత బలం ఉందనే దానిపై దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ మూడు నియోజిక వర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అవేవనగా నిజామాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్.. ఈ మూడు చోట్ల గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 2014, 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ కేటాయించింది బి‌ఆర్‌ఎస్ అధిష్టానం. ఇక కాంగ్రెస్ తరుపున బరిలో ఎవరు నిలుస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

అలాగే బిజెపి నుంచి ధర్మపురి అరవింద్ పేరు వినిస్తున్నప్పటికి తొలి జాబితా వచ్చే వరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ నియోజిక వర్గంలో గణేశ్ గుప్తా పై ప్రజల్లో మంచి సానుకూలత ఉంది. దానికి తోడు కే‌సి‌ఆర్ పాలనపై ప్రజల్లో ఉండే విశ్వాసనియత కారణంగా ఈసారి కూడా ఇక్కడ బి‌ఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ విషయానికొస్తే 2014 మరియు 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ తరుపున టి. పద్మారావు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ బి‌ఆర్‌ఎస్ తరుపున ఆయనే బరిలోకి దిగనున్నారు.

ఇక కాంగ్రెస్ తరుపున ఏ. సంతోష్ పోటీ చేయనున్నారు. అలాగే బీజేపీ తరుపున కిషన్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికి అభ్యర్థుల జాబితాను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలు చూస్తే సికింద్రాబాద్ లో కూడా బి‌ఆర్‌ఎస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమౌతోంది. ఇక వికారాబాద్ విషయానికొస్తే గత ఎన్నికల్లో గెలిచిన మెతుకు ఆనంద్ కే మళ్ళీ టికెట్ కేటాయించింది బి‌ఆర్‌ఎస్ అధిష్టానం. ఇక కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నియోజిక వర్గంలో కూడా బి‌ఆర్‌ఎస్ కు తిరుగులేదు. దాంతో ఇక్కడ కూడా గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయంగా తెలుస్తోంది. మొత్తానికి ఈ మూడు నియోజిక వర్గాల్లో బి‌ఆర్‌ఎస్ బాద్ షా లే జెండా పాతనున్నారని క్లియర్ గా తెలుస్తోంది.

Also Read:18 ఏళ్ల కుర్రాడితో త్రిష బరితెగింపు

- Advertisement -