గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన ఎంపీ గౌతమ్ గంభీర్

76
gic

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సభ్యుడు గౌతమ్ గంభీర్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్ లో మొక్కలు నాటారు.

కార్యక్రమ అనంతరం గౌతమ్ గంభీర్ కు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమని.. ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు గంభీర్ కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని గంభీర్ తెలిపారు. త్వరలోనే ట్విట్టర్ వేదికగా ముగ్గురికి సవాల్ విసురుతానని తెలిపారు.