మాచర్ల నియోజకవర్గంలో నితిన్..

95
nithin

వినాయకచవితి సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు హీరో నితిన్. తన 31వ సినిమా టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా ‘ఉప్పెన’ ఫేం కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరోహీరోయిన్లపై ముహూర్తం షాట్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను నిఖిల్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం నితిన్ నటించిన మాస్ట్రో సెప్టెంబర్ 17న ఓటీటీ వేదికగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Macherla Niyojakavargam Motion Poster | Nithiin | Krithi Shetty | M.S Raja Shekhar Reddy