సంచలన నిర్ణయాలు తీసుకున్న ‘మా’ నూతన కమిటీ

202
MAA

మూవీ ఆర్టీస్ట్ అసోషియేష్ నూతనంగా ఎన్నికైన సభ్యలు తొలిసారిగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి మా ప్రెసిడెంట్ నరేష్, జనరల్ సెక్రటరీ జవిత రాజశేఖర్ , పలువురు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఈసమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ఆర్టీస్ట్ ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు సభ్యులు.

మా సభ్యులకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని తెలియజేసేందుకు 95020 30405 నంబరుతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ఇస్తున్న వెయ్యి రూపాయలను రూ.6వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘మా’ సభ్యులకు కూడా వర్తించేలా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. కొత్తగా చేరే సభ్యులు రెండు సంవత్సరాలకు గానూ రూ. 25వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చాన్నారు.

ఈరెండు సంవత్సరాల్లో మరో రూ.75వేలు చెల్లిస్తే జీవిత కాల సభ్యత్వ కార్డు జారీ చేయాలని కార్యవర్గం నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను వర్తింప జేయగా దీనికి ఇప్పుడు మరో లక్ష రూపాయలు జోడించి రూ. 3 లక్షల బీమాను అందించనున్నట్టు ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ తెలిపారు.