సొంత గడ్డపై సన్ రైజర్స్ ఘన విజయం..

142
warner

ఐపిఎల్ సీజన్ 12లో భాగంగా నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. పంజాబ్ పై హైదరాబాద్ 45పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణిత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 212పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెచ్చిపోయాడు. వార్నర్ 56బంతుల్లో 81పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

కీపర్ వృద్దిమాన్ సాహా 13బంతుల్లో 28పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే 25బంతుల్లో 36పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. పంజాబ్ బౌలర్లలో షమీ 2, రహమాన్ 2, అశ్విన్ 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు. 212పరుగుల లక్ష్యంతో బరిలోకి పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తప్ప మిగతా వారేవరు ఆకట్టుకోలేకపోయారు.

కేఎల్ రాహుల్ 56బంతుల్లో 71పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విధ్వంసకర ఆటగాడు గేల్ 3బంతుల్లో 4పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ 18బంతుల్లో 27పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు ఎవరూ పెద్దగా స్కొరు చేయకపోవడంతో 167పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్. నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవడంతో ప్లే ఆప్స్ రేసులో స్ధానం సంపాదించుకుంది.