ఐపీఎల్ 2018 ఆటగాళ్ల రీటెయిన్ జాబితా విడుదలయ్యింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రూ. 17 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తిరిగి సొంతం చేసుకుంది. కోహ్లీ ధర రూ. 15 కోట్లు ఉండగా ఆర్‌సీబీ జట్టు మరో రూ. 2 కోట్లు అదనంగా చెల్లించి మొత్తం రూ. 17 కోట్లకు అతన్ని దక్కించుకుంది. అలాగే విరాట్ తర్వాతి స్థానంలో యువరాజ్ సింగ్ నిలిచారు. రూ. 16 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఆయనను సొంతం చేసుకుంది.
విరాట్ కోహ్లీ, ఏబీ డీవిల్లియర్స్, సర్ఫరాజ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంజైచీ తిరిగి దక్కించుకోగా మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, జడెజాలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రీటెయిన్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను తిరిగి దక్కించుకోగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇద్దరు వెస్టిండీస్ ఆటగాళ్లు ఆండ్రూ రసెల్, సునిల్ నరీన్‌ను తిరిగి తీసుకోగా కెప్టెన్ గంభీర్‌ను వదులుకుంది.
ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రాను రీటెయిన్ చేసుకోగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్‌ను తిరిగి దక్కించుకుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అక్షర్‌పటేల్‌ను రీటెయిన్ చేసుకోగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు దక్షిణాఫ్రికా క్రిస్ మోరిస్, శ్రేయాస్ ఐయర్, రిషబ్ పంత్‌లను తిరిగి దక్కించుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కోచ్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నియమితులయ్యారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా ధోనినే దానికి సారథ్యం వహించనున్నాడు. ధోనీ (సీఎస్‌కే – రూ. 15 కోట్లు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ – రూ. 15 కోట్లు), ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (రూ.14.5కోట్లు), స్టీవ్ స్మిత్ (రాజస్థాన్ రాయల్స్ – రూ.12 కోట్లు), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ.12 కోట్లు)తో టాప్ పొజిషన్‌లో ఉన్నారు.