‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విడుదలకు ముహార్తం ఖరారు..

97

టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈమూవీ ఇప్పటికే పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక నుంచి ఈ సినిమా ప్రమోషన్లు జోరందుకుంటాయని చెప్పుకొచ్చారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నిర్మితమైంది.