మోడీ ప్రమాణస్వీకారం…నోరూరించే వంటకాలు రెడీ

429
modi

భారత ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. దేశ విదేశాల నుంచి రాయబారులు, వీవీఐపీలు రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక మోడీ ప్రమాణస్వీకార కార్యక్రామనికి హాజరయ్యే అతిథులు కనీవినీ ఎరుగని అద్భుతమైన విందును ఆస్వాదించబోతున్నారు. ఆతిథ్యం అద్భుతంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఆరువేల మంది అతిథులకు అద్భుతమైన వంటకాలతో కమ్మని విందుభోజనం పెట్టనున్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ దేశాల ప్రముఖ వంటలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన స్పెషల్ డిష్‌లను అతిథులకు రుచిచూపించబోతున్నారు.

ఇక ఈ విందులో దాల్ రైసినా స్పెషల్ కానుంది. వెజ్‌తో పాటు నాన్ వెజ్‌ వంటకాలను అతిథులకు అందించనున్నారు. ఇక ప్రధానమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం 48 గంటల ముందు నుంచే అంటే మంగళవారం రాత్రి నుండే వంటలను స్టార్ట్ చేశారు. మొత్తంగా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం నభూతో న భవిష్యత్ అన్నట్లుగా సాగనుంది.