డబ్బు మీద నాకు ఆశలేదు..ప్రతి ఇంటిలో నాఫోటో ఉండాలిః జగన్ స్పెషల్ ఇంటర్వూ

893
Jagan
- Advertisement -

ఏపీలో ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా ఆయన ఓ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూలో జగన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

యాంకర్ః మొన్న ఢిల్లీలో మీరు బీజేపీకి 250సీట్లు వచ్చి ఉంటే బాగుండేది అన్నారు..ఎందుకు?
జగన్ః 250సీట్లు మాత్రమే వాళ్లకు వచ్చి ఉంటే ఈపాటికి ప్రత్యేక హోదా అన్న అంశం మీద సంతంకం పెట్టెవారు. ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వం ఏర్పడాలన్న ఖచ్చితంగా మా మద్దతు అవసరం పడేది. అటువంటి పరిస్ధితి రావాలని దేవుణ్ని నిజంగా ప్రార్ధించాను. భగవంతుడు ఏపీలో వైసిపి ఏవిధంగా ఆశీర్వదించాడో దురదృష్టవశాత్తు కేంద్రంలో కూడా ఎన్డీయేను అదేవిధంగా ఆశిర్వదించాడు. అయినా తాము ప్రత్యేక హోదా కోసం కష్టపడుతూనే ఉంటాం. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన డిమాండ్లన్ని ఇచ్చే వరకూ పోరాడుతాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడదిశారు. ప్రత్యేక హోదా అనే అంశం తప్పకుండా వాళ్లకు గుర్తు చేస్తూనే ఉంటాం. మనం ఒక్కసారి అడగడం మానేసాము అంటే ప్రత్యేక హోదా అంశం కనుమరుగైపోతుంది. ప్రత్యేక హోదా అనేది ఎవ్వరూ మర్చిపోలేని అంశం. నేను ప్రధాన మంత్రిని ఎప్పుడు కలిసినా ప్రత్యేకహోదా, విభజన అంశాలపై అడుగుతూనే ఉంటాం.

యాంకర్ః మీరు మోదీని కలిశారు… ఆ సమావేశం ఎలా అనిపించింది. రాష్ట్రానికి సహాయం చేకూరేలా అనిపిస్తుందా?
జగన్ః దాదాపు కు గంటకు పైగా మా సమావేశం జరిగింది. నేను అడిగిన ప్రశ్నలకు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యాడు. ప్రధాని కాకముందే మనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం దాదాపుగా గంట సేపు మనతో చర్చించడం..అనని విషయాలను సుదీర్ఘంగా అడగటం..మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశంపై దాదాపు అరగంటకు పైగా మాట్లాడాము. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి జరిగే లాభాల గురించి మోదీకి స్పష్టంగా వివరించాం. మేము అడిగిన ప్రశ్నలన్నింటికి చాలా సున్నితంగా ఆయన సమాధానం ఇచ్చారు.

యాంకర్ః మిరు ఇందాక చెబుతూ కేంద్రంలో ఎన్డీయేకు 250సీట్లు ఈపాటికి మనకు ప్రత్యేక హోదా మీద సంతకం చేసే వాళ్లు అన్నారు.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదు..ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా స్పందించపోతే మీ ప్రణాళిక ఏంటి? ఎంత వరకూ ఎదురుచూడడానికి సిద్దంగా ఉన్నారు?
జగన్ః రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను ఉన్నాను..దేశ ప్రధానికి మోదీ ఉన్నారు. రాష్ట్ర విడిపోయేనాటికి రాష్ట్ర పరిస్ధితి, అప్పులు 67ఏండ్ల పరిపాలన తర్వాత మన రాష్ట్రానికి మనభాగం కింద వచ్చిన అప్పులు 97వేల కోట్ల రూపాయలు. ఈ 5ఏండ్లలో ఆ అప్పులు 2లక్షల 58వేల కోట్ల వరకూ ఏగబాకిన పరిస్ధితి ఉంది. ఆ అప్పుల మిద కేవలం వడ్డిలే సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఆ వడ్డిలతో పాటు అసలు కూడా కలుపుకుంటే సంవత్సరానికి 40వేల కోట్లు అవుతుంది. ఇటువంటి పరిస్ధితుల్లో రాష్ట్రానికి నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహాకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రజలకు మంచి చేయాలనే అలోచన ఉంటే ఖచ్చితంగా కేంద్ర నుంచి మద్దతు కావాలి. ఇటువంటి పరిస్ధితుల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మన అవసరం గనుక వచ్చిఉంటే వేరే రకమైన పరిస్ధితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 340సీట్లు వాళ్లకు వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్లకు వచ్చే నష్టం ఉండదు.

యాంకర్ః అంటే మీరు ఎన్నికల ప్రచారంలో కేంద్రంతో పోరాడుదాం..ప్రత్యేక హోదా సాధించుకుందాం అన్నారు. మరి ఇప్పుడు ఆగుతూ వద్దాం అంటన్నారు?
జగన్ః వాళ్లకు మెజార్టీ ఎంపీ స్ధానాలు ఉన్నప్పుడు మనం ఏం చేయగలిగింది ఏం లేదు. పోరాడటం తప్ప. నేను గత 5ఏండ్లుగా మర్చిపోకుండా ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నా.. ఇప్పటికి కూడా అదే కమిట్ మెంట్ తో ఉన్నా. తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. వాళ్లకు 340స్ధానాలున్నప్పుడు మనం ఎంత పోరాడిన వాళ్లు పట్టించుకోరు. ప్రత్యేక హోదా ఎవరూ మర్చిపోకూడదు..అది మన హక్కు అన్న ఉద్యేశ్యంతో ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూనే ఉన్నాం. ప్రధానమంత్రికి రాసే ప్రతి లేఖలో ఫస్ట్ పేజిలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించే ఉంటుంది.

యాంకర్ః రాష్ట్రం విషయానికి వస్తే మిరు ఇందాక చెప్పినట్లు కేవలం సంవత్సరానికి వడ్డియే 20కోట్లు ఉందని చెప్పారు..ఈ నేపథ్యంలో మీరు నవరత్నాలు అన్న హామిలు ఇచ్చారు. ఈ నవరత్నాలు అనే హామిలకు కూడా దాదాపు 56వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయన్న ఒక అంచనా ఉంది. ఎలా ఈ హామిలన్ని అమలు చేద్దామని అనుకుంటున్నారు..దీనిపై ఏమైనా ప్రణాళిక రూపొందించారా?
జగన్ః నవరత్నాల గురించి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అమలు చేసి చూపిస్తాం. మ్యానిఫెస్టో నవరత్నాలు అన్నది నాకు బైబిట్, కురాన్ , భగవత్గిత లాంటిది. పథాకాల అమలుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామ వాలంటర్లు, గ్రామ సెక్రటెరీయట్లను తీసుకురాబోతున్నాం. వాళ్ల ద్వారా గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమం త్వరలో చేపడుతాం.

యాంకర్ః అవినీతి రహిత పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఒకవైపు హైదరాబాద్ లో కోర్టులలో కేసులు నడుస్తున్నాయని మీ ప్రత్యర్దులు ఎన్నికల సమయంలో ఆరోపణలు చేశారు.. దిన్ని ఎలా చూస్తారు మీరు?
జగన్ః నామీద ఉన్న అవినితి ఆరోపణలకు సంబంధించి..నా మీద ఉన్న కేసులు ఎప్పుడు పెట్టారు ఎవరూ పెట్టారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రా ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే నన్ను ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మా నాన్న బతికి ఉన్నన్ని రోజులు జగన్ అనే వ్యక్తి మీద ఏ ఒక్క కేసు తెదని ఆంధ్ర ప్రజలకు తెలుసు. జగన్ అనే వ్యక్తి కాంగ్రెస్ లో ఉన్న ఏ ఒక్క కేసు లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్ మీద కేసులు ఎప్పుడు వచ్చాయంటే మా నాన్న చనిపోయాక కేసులు వచ్చాయి. జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్లి పోయాక కేసులు పెట్టారు. రాజకీయాంగా జగన్ ను అణగదొక్కాలనే ఉద్దయేశ్యంతో నామీద కేసులు పెట్టారన్న సంగతి అందరికి తెలుసు. జగన్ అనే వ్యక్తి మీద కేసులు పెట్టింది చంద్రబాబునాయుడు పార్టీకి చెందిన లీడర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు.

ఇవన్ని ఆంధ్రా రాష్ట్ర ప్రజలకు చాలా బాగా తెలుసు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అనే వ్యక్తి ఓ ఐఎయస్ ఫోన్ చేయేలేదు…సెక్రటేరిట్ కు పోలేదు… అసలు జగన్ అనే వ్యక్తి హైదరాబాద్ లోనే లేడు. ఇవన్ని ఆంధ్రా ప్రజలకు తెలుసు. 50శాతం ఓట్లతో మా పార్టీని గెలిపించారు. ఆంధ్ర చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. నాకు డబ్బు మీద ఆశ లేదు. నేను చనిపోయిన తర్వాత జనంలో బతికి ఉండాలి. ప్రతి ఇంటిలో నా ఫోటో ఉండాలి. నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి..దానా కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఈ వ్యవస్దను తప్పకుండా ప్రక్షాళన చేస్తా. అవినీతి అనేది ఎక్కడా జరగకుండా చూస్తా. పై స్ధాయి నుంచి కింది స్ధాయి వరకూ పూర్తిగా వ్యవస్ధను మారుస్తాం. రాబోయే రోజుల్లో మేము ఏదైనా కొత్తగా టెండర్లు పిలిచే కార్యక్రమం చేస్తే దాంట్లో కూడా అవినీతి అనేదానికి అవకాశం లేకుండా జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయమని చీఫ్ జస్టిస్ ను అడుగుతాం.

- Advertisement -