కరోనా ఎఫెక్ట్..హోలీ వేడుకలకు దూరం

331
modi
- Advertisement -

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనబోమని మోడీ, షా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కరోనా వ్యాప్తి కట్టడి కోసం సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. అందుకే ఈసారి ఎలాంటి హోలీ కార్యక్రమాల్లో పాల్గొనని తెలిపారు.

భారతీయులకు హోలీ చాలా ముఖ్యమైన పండుగని.కానీ కరోనావైరస్ నేపథ్యంలోఈ సంవత్సరం ఏ హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు అమిత్ షా. బహిరంగ సమావేశాలను నివారించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

- Advertisement -