Modi: హనుమాన్ చాలీసా వినడం నేరమేనా?

21
- Advertisement -

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో సవోయి మాధోపుర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ…కాంగ్రెస్ పాల‌న‌లో హ‌నుమాన్ చాలీసా విన‌డం కూడా నేర‌మేన‌ని మండిపడ్డారు.

ప్రజ‌ల ఆస్తుల‌ను లాగేసుకుని వాటిని ఎంపిక చేసిన‌ కొంద‌రికి క‌ట్ట‌బెట్టేందుకు కాంగ్రెస్ నేత‌లు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. రాజ‌స్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామ న‌వమి వేడుక‌ల‌ను నిషేధించింద‌ని…ప్ర‌జ‌లు రామ శ‌బ్ధాన్ని ఆల‌పించే రాజ‌స్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామ‌నవ‌మిని నిషేధించింద‌ని అన్నారు.

సంపద పునఃపంపిణీ.. కాంగ్రెస్‌, విప‌క్ష ఇండియా కూటమికి నచ్చడం లేదని..అందుకే వారు ప్ర‌తిచోటా మోడీని తిడుతున్నార‌ని అన్నారు.

Also Read:రచయితగా మారిన అల్లరి నరేష్..

- Advertisement -