- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో పురస్కారం దక్కింది. మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్ఠాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మోదీ సమర్థ నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసింది.
మోదీ తరఫున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెటిటా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును గతేడాది నవంబర్ 20న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరిగిన 2వ ఇండియా-CARICOM లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ప్రకటించినట్లు పేర్కొంది.
Also Read:టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్
- Advertisement -

