కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని ఎద్దేవా చేశారు. మోదీ సమన్లకు భయపడేవారు తెలంగాణలో ఎవరూ లేరని తప్పకుండా విచారణను ఎదుర్కొంటాం అని అన్నారు. భారత చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం…విచారణను ఎదుర్కొంటాం అని అన్నారు. విచారణను ఎదుర్కొనే దమ్ము మాకుంది…విచారణను ఎదుర్కొనే దమ్ము మీకుందా అని మోదీ నిలదీశారు. లిక్కర్ స్కాంలో కవిత విచారణను ఎదుర్కొంటుంది. మరీ ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్‌కు విచారణకు రాకుండా దాక్కున్నారు అని మండిపడ్డారు.
దేశంలో గత 8యేండ్లుగా జరుగుతున్న ప్రహసనంలో భాగంగా ఇవాళ అయితే జుమ్లా లేకపోతే ఆమ్లా అనే విధానంలో మోదీ ప్రభుత్వం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి ప్రజలపై ధరల దాడి..ఇవి తప్ప వీరు సాధించింది ఏమీలేదు అని ప్రశ్నించారు. దేశంలో ఈడీని ప్రభుత్వం పావుల వాడుకుంటందని అన్నారు. 2014 తర్వాత ప్రతిపక్షాలపై 5422ఈడీ కేసులు నమోదు అయ్యాయి అని కేటీఆర్ తెలిపారు. వీటీలో 23కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదే మోదీ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
మా మంత్రి గంగుల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు. మల్లారెడ్డి మీద ఐటీ దాడులు చేయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ ఇంటి మీద ఈడీ దాడి చేసింది. జగదీశ్ రెడ్డి పీఏ ఇంటి మీద ఐటీ దాడులు చేసింది. నామా నాగేశ్వర్ రావు మీద ఈడీ దాడులు చేయించింది. వద్దిరాజు రవిచంద్రపై సీబీఐ దాడులు చేసింది. పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులు చేయించారు. ఎమ్మెల్సీ రమణపై ఈడీ విచారణ జరిపారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ ఐటీని ఉసిగొల్పింది. అక్కడ చేయగలిగింది ఏమీ లేక.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ సమన్లు పంపింది. ఇవి ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లు. ఇది రాజకీయంగా చేసే చిల్లర ప్రయత్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలాగా మారాయాని కేటీఆర్ ధ్వజమెత్తారు.
9యేండ్ల పాలనలో 9రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చినన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ అంటే దేశానికి అర్థమైంది ఒక ఇంజిన్ మోదీ ఇంకో ఇంజిన్ అదానీ అని అన్నారు. అడ్డమైన దొంగ సొమ్ముతో ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చి లొంగని వారిపై ఈడీ సీబీఐ దాడులు చేయించాలి అని అన్నారు. నీతిలేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈ రోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు
ఎమ్మెల్సీ కవిత దీక్షకు విపక్ష నేతలు
తెలంగాణ కేబినెట్ భేటీ..