బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్లు

23
- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి. త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌ర‌సింహాచార్యుల‌కు స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. నామినేష‌న్ల దాఖ‌లు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు గ‌న్‌పార్కులోని అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళుల‌ర్పించారు.

ముగ్గురిలో కుర్మయ్యగారి నవీన్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దేశపతి శ్రీనివాస్ కవిగా, ఉద్యమకారుడిగా పేరు పొందారు. ప్రభుత్వ టీచర్ అయిన దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని కీలక పాత్ర పోషించారు. చల్లా వెంకట్రామి రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన మాజీ రాష్ట్రపతి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నీలం సంజీవ రెడ్డి మనవడు. రాజకీయంగా ఆయనకు సొంత ప్రాంతంలో మంచి పట్టుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -