వరి మద్దతు ధర పెంచిన కేంద్రం…

301
modi msp price hike
- Advertisement -

రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త నందించింది. వరి సహా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రమంత్రివర్గం అమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 14 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెరగనుంది. క్వింటాల్‌ వరిపై మద్దతు ధర రూ. 200 వరకు పెరగనుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెరగనుంది.

గ్రేడ్‌ ఏ రకం వరి క్వింటాల్‌ ధర రూ. 1,590 నుంచి రూ. 1,750కి , పత్తి ధర రూ. 4,020 నుంచి రూ. 5,150కి పెంచారు. పంటల సాగు వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను పెంచుతామని బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

- Advertisement -