ఇది దయన్న విజయం: ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

24
MLA Bethi Subhash Reddy

మల్లాపూర్ లోని విఎన్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కృతజ్ఞత సభ జరిగింది. ఈ సభకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, మీర్ పేట్ కార్పొరేటర్ ప్రభుదాస్, డివిజన్ టీఆరెఎస్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, హాజరైయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్‌లో టీఆరెఎస్ విజయం మంత్రి దయన్న విజయమని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. ఒంటి చేతితో విజయాన్ని తెచ్చి పెట్టారని అభినందించారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా డివిజన్ అభివృద్ధికి మంత్రి కృషి చేస్తరని ఆయన చెప్పారు.

మేయర్ బొంతు మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్కడ ఉంటే, అక్కడ విజయం చేకూరుతుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. దయన్న ట్రబుల్ షూటర్ అని కొనియాడారు. దయన్న అనుభవం, తీసుకున్న దత్తత మీర్ పేట్ డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ.. తన విజయం, దయన్న విజయమని మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. తన ఎన్నిక లాగా దయన్న తన గెలుపు కోసం పని చేశారని చెప్పారు. డివిజన్ ను దత్తత తీసుకున్న దయన్న, డివిజన్ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని కోరారు. తనను గెలిపించిన దయన్న, సుభాష్ రెడ్డి, డివిజన్ టీఆరెఎస్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజలకు కృతఙ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తాను, ప్రభుదాస్ తో కలిసి, పెద్దలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మంత్రి కేటీఆర్, అధినేత కెసిఆర్ గారి ఆశీస్సులు, సహకారంతో డివిజన్ అభివృద్ధికి పాటు పడతా నని డివిజన్ టీఆరెఎస్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి తెలిపారు.