గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్ ఫేం‌ సుజాత..

655
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు నోయెల్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు ప్రముఖ యాంకర్ , బిగ్ బాస్ 4 షో సుజాత.

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో పచ్చదనం పెరిగి వానలు రావాలి.. కోతులు అడవులకు వాపసు పోవాలి అనే ఉద్దేశ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఈ చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మన అందరూ కూడా బాధ్యతగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడమే మనమిచ్చే గొప్ప సంపద అన్నారు. అనంతరం మరో ముగ్గురు ( యాంకర్ మంగ్లీ, మోనాల్, స్వాతి దీక్షిత్ ) లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.