- Advertisement -
ధనసరి అనసూయ అలియాస్ సీతక్క…ఈ పేరంటే తెలియని వారుండరూ. ములుగు ఎమ్మెల్యేగా తనకంటూ ప్రజాసేవలో ఓ ఇమేజ్ సంపాదించుకున్న సీతక్క…ఏం చేసినా సెన్సేషనే. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి మన్ననలు పొందుతున్న సీతక్క తాజాగా రైతుగా మారారు.
ఒక్క రోజు రైతుగా బ్రతికి చూడు దాంట్లో ఉండే కష్టం ఏంటో అర్ధమవుతుందటూ గురువారం సమ్మక్క- సారక్క తల్లులను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఓ పొలంలో నాట్లు వేస్తున్న కూలీలను చూసి ఆగారు.
వారివద్దకు వెళ్లి వారితో కలిసి నాట్లేసారు. అంతేకాకుండా తన వెంట వచ్చిన కార్యకర్తల చేత కూడా నాట్లు వేయించి సందడి చేశారు. మహిళా కూలీలతో కలిసి పొలంలోకి దిగిన సీతక్క.. సరదాగా పాటలు పాడుతూ నాట్లు వేశారు. కూలీలతో శృతి కలిపి పాటలు పాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -