ఆస్కార్ రేసులో జై బీమ్: సీతక్క ప్రశంసలు

160
seethakka
- Advertisement -

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటికే పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు గుప్పించగా తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్‌ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తూ చిత్ర బృందానికి ముందస్తుగా తన అభినందనలు తెలియజేశారు. అయితే సీతక్క చేసిన ట్వీట్‌కు స్పందించిన హీరో సూర్య తమ చిత్ర బృందం తరఫున సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -