Sethakka:సీతక్క కు ఓటమి తప్పదా?

76
- Advertisement -

ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధనసరి అనసూయ కు ఈసారి ఓటమి తప్పదా ? ములుగు నియోజకవర్గ ప్రజలు ఆమెపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా ? ఆమె పబ్లిసిటీ తప్పా నియోజక వర్గంలో చేసిందేమి లేదా ? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నక్సలైట్ బ్యాక్ గ్రాండ్ తో వచ్చిన సీతక్క 2009 మరియు 2018 ఎన్నికల్లో ములుగు నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆమె నిత్యం ప్రజల్లో ఉన్నట్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లుగా తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. .

రోడ్డు మార్గం లేని గ్రామాలకు ఆమె కాలినడకన వెళ్ళడం, వరదలు వచ్చిన ప్రాంతాలకు వరద నీటిలోనే నడుచుకుంటూ ప్రజల దగ్గరకు వెళ్ళడం, కరోనా ప్రజలకు అండగా ఉన్నట్లు చూపించుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇవన్నీ కూడా ఆమె పబ్లిసిటీ కోసమే చేస్తున్నారనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కెమెరా ఉన్నంత సేపు ప్రజలపై ప్రేమ కురిపించే సీతక్క కెమెరా లేకపోతే అసలు ప్రజలవైపు కన్నెత్తి కూడా చూడరని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. నియోజక అభివృద్ది కోసం కే‌సి‌ఆర్ విడుదల చేసిన నిధులను ఆమె దుర్వినియోగం చేశారనే విమర్శ కూడా ఎక్కువగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈసారి ములుగులో ఆమెకు ఓటమి తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున సీతక్క బరిలో ఉండగా బి‌ఆర్‌ఎస్ తరుపున బడే నాగజ్యోతి బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ప్రస్తుతం నాగజ్యోతి వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నాగజ్యోతి కూడా పెద కుటుంబం నుంచి రావడం, పేదల కష్టాలు తెలిసిన ఆమె కావడంతో ప్రజలు నాగజ్యోతి విషయంలో సంతృప్తి గా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ప్రజలు నాగజ్యోతి అందుబాటులో ఉండడం కూడా ములుగు ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో ఈసారి ములుగులో నాగజ్యోతి నుంచి సీతక్కకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read:Chandrababu:బాబు మళ్లీ జైలుకెళ్ళాల్సిందేనా?

- Advertisement -