సన్‌రైజర్స్‌పై అజార్ అసంతృప్తి..

54
azar

ఐపీఎల్ 14వ సీజన్ వేలం చెన్నై వేదికగా గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. 292 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు హెచ్‌సీఏ చీఫ్,భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్. సన్ రైజర్స్ జట్టులో కనీసం ఒక్క హైదరాబాదీకి స్థానం లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నారు.

హైదరాబాద్ జట్టులో స్థానికులకు చోటు లేదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌కు చెందిన హనుమవిహారిని తీసుకున్న సన్ రైజర్స్ ఈసారి అతన్ని జట్టులోనికి తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది. అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ కేదార్ జాదవ్‌ను దక్కించుకోవడం విశేషం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, అబిషేక్ శర్మ, నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, గోస్వామి, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపి, విరాట్ సింగ్ ఉన్నారు. కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు: సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ రెహమాన్.