మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

352
MLA Rathod Bapu Rao
- Advertisement -

ఈ రోజు తన జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బోధ నియోజకవర్గంలోని సాయిలింగం గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దు బిడ్డ, హరిత ప్రేమికుడు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అని కానీ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కోట్లాది మొక్కలు నాటారు అని తెలిపారు.

ఈ రోజు నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం పెట్టడం జరిగిందని ఇలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు బాగా పడి మంచిగా పంటలు పండాలంటే మనందరం కూడా బాధ్యతగా మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ చేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పుట్టిన రోజు, నా పుట్టిన రోజు అనే కాకుండా సర్పంచ్ నుండి మొదలుకోని ప్రతినాయకులు వారి వారి పుట్టినరోజు సందర్భంగా స్వతహాగా మొక్కలు నాటాలని తెలిపారు.రాజ్యసభ సభ్యులు సంతోష్ లాగా మనందరం కూడా మొక్కలు పెంపకంపై అభిమతం పెంచుకొని ముందుకు కొనసాగాలని కోరారు. ఈ సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని కోరిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -