Palla:ఒకేసారి రుణమాఫీ ఏమైంది?

32
- Advertisement -

ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పల్లా… కేసీఆర్‌ హయాంలో మొదటి విడుతలో 35 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు చెల్లించామన్నారు. రైతుల రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని…చేసింది గోరంత…చెప్పేది మాత్రం కొండంతలా కాంగ్రెస్ నేతల వైఖరి ఉందన్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు.రైతుబంధు కింద కేసీఆర్‌ రూ.70 వేల కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు పల్లా.కేసీఆర్‌ కట్టించిన రైతు వేదికల్లో కాంగ్రెస్‌ సంబురాలు చేసిందని …కాంగ్రెస్‌ నాయకులకు బూతులు తప్ప రైతులపై శ్రద్ధలేదని విమర్శించారు.

సీఎం హోదాలో ఉన్న రేవంత్‌ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. ప్రజల గుండెల్లో కేసీఆర్‌ ఉన్నారని ..కేసీఆర్‌ ఏం చేశారో రైతులకు తెలుసని వెల్లడించారు. కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.

Also Read:BMSలో ప్రభాస్ ఆల్-టైమ్ రికార్డ్

- Advertisement -