తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి..

25
hanumantharao

తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగానాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ… స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఏపి సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని స్వామి వారి ఆశీస్సులు పోందడం జరిగిందన్నారు..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.‌ అనునిత్యం ప్రజాసేవలో ఉండే జగనన్న చేసే కార్యక్రమాలు సత్ఫలితాలు అందించాలని కోరినట్లు తెలిపారు..ప్రజలకు సంక్షేమ పధకాలు అందకుండా ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్న తరుణంలో ఆటంకాలు కలుగకుండా చేయాలని స్వామి వారిని ప్రార్ధించడం జరిగిందని ఆయన అన్నారు..