- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట్‌లో ఒక కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధికారులతో అత్యవసర సమావేషం ఏర్పాటు చేశారు. మెడికల్, పర్టిలైజర్ షాపులు మినహా మిగతా అన్ని షాపులు ఉదయం 10 నుంచి మధ్యహ్నం 2 వరకు తెరిచి ఉంచాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రజలు తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలి ఎమ్మెల్యే క్రాంతి కోరారు.
ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,005 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 217 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,452 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం 3,189 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,317 మందికి నెగెటివ్ వచ్చింది. 872 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 60,243 మందికి కరోనా పరీక్షలు చేశారు.
- Advertisement -