ఓటీటీలో సూపర్ హీరో ‘మిన్నల్ మురళి’..

173
- Advertisement -

టోవినో థామస్ నటించిన మిన్నల్ మురళి చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న రాబోతోంది. నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే మిన్నల్ మురళి. ఈ చిత్రాన్ని సోపియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది. చెడు మీద మంచి చేసిన యుద్దాన్ని మిన్నల్ మురళి చిత్రంలో చూడవచ్చు. అది కూడా కేవలం నెట్ ఫ్లిక్స్‌లోనే. డిసెంబర్ 24న ఈ మూవీ ప్రీమియర్ కాబోతోంది.

దర్శకుడు : బసిల్ జోసెఫ్
నటీనటులు : టోవినో థామస్, గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్
రచయిత, స్క్రీన్ ప్లే, మాటలు : అరున్ ఏ ఆర్, జస్టిన్ మాథ్యూస్
పాటలు : మను మంజిత్
సంగీతం : షాన్ రెహ్మాన్, సుశిన్ శ్యామ్

- Advertisement -