బోనస్ ట్రైలర్‌తో సర్ ప్రైజ్ చేసిన సూపర్ హీరో ‘మిన్నల్ మురళి’

55
minnal murali

బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో టొవినో థామస్ హీరోగా నటించిన మిన్నల్ మురళి చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న రాబోతోంది.సూపర్ హీరో మిన్నల్ మురళీ ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లేందుకు బోనస్ ట్రైలర్‌తో సర్ ప్రైజ్ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులను దోచేందుకు, రికార్డుల కొల్లగొట్టేందుకు రెడీగా ఉంది. చెడు మీద మంచి చేసిన పోరాటం, సాధించిన విజయాన్ని ఈ చిత్రంలో చూపించబోతోన్నారు. ఈ సినిమాతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. ఈ చిత్రం మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.

ఈ చిత్రాన్ని వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద సోపియా పాల్ నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 24న ఈ మూవీ కేవలం నెట్ ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రీమియర్ కాబోతోంది.

దర్శకుడు బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘మిన్నల్ మురళీ ట్రైలర్‌కు విశేష స్పందన రావడం ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు.. మిన్నల్ మురళీ ప్రపంచం ఎలా ఉండబోతోందనేది ఈ బోనస్ ట్రైలర్ ద్వారా చూపించాలని అనుకున్నాం. ఓ మంచి సినిమాను అందించి ప్రేక్షకులను అలరించాలనేది మా ఉద్దేశ్యం. ఈ బోనస్ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో సినిమా పట్ల మరింతగా అంచనాలు పెరిగాయయని ఆశిస్తున్నా. సినిమా కోసం వారంతా ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నాను’ అని అన్నారు.

వీకెండ్ బ్లాక్ బస్టర్స్ నుంచి సోఫియా పాల్ మాట్లాడుతూ.. ‘మిన్నల్ మురళీ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మలిచి ప్రతీ ఒక్కరికీ నచ్చేలా తీయాలనేది మా లక్ష్యం. అద్భుతమైన కథతో పాటు మంచి నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. వారందరి పనితనం వల్ల సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక ఆడియెన్స్‌కు పుడుతుంది. ఈ బోనస్ ట్రైలర్‌తో సినిమాను చూడాలనే కోరిక మరింత ఎక్కువ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

చెడు మీద మంచి చేసిన యుద్దాన్ని మిన్నల్ మురళి చిత్రంలో చూడవచ్చు. అది కూడా కేవలం నెట్ ఫ్లిక్స్‌లోనే.

నిర్మాత : వీకెండ్ బ్లాక్ బస్టర్స్ (సోఫియా పాల్)
దర్శకుడు : బసిల్ జోసెఫ్
నటీనటులు : టోవినో థామస్, గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్
రచయిత, స్క్రీన్ ప్లే, మాటలు : అరున్ ఏ ఆర్, జస్టిన్ మాథ్యూస్
పాటలు : మను మంజిత్
సంగీతం : షాన్ రెహ్మాన్, సుషిన్ శ్యామ్