తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..

29

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కు సంబంధించి ఫలితాలను ఈరోజు అధికారులు విడుదల చేశారు. ఐసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. ఈసారి ఐసెట్ కు 56,962 మంది హాజరు కాగా, 51,316 మంది అర్హత సాధించారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

ఇక ఈ ఫలితాలలో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ కు మొదటి ర్యాంకు లభించింది. రెండో ర్యాంకును పమిడి సాయి తనూజ (హైదరాబాద్) సాధించగా, ఆర్ న‌వీన‌క్షంత (మల్కాజిగిరి) మూడో ర్యాంకు పొందగా… తుమ్మ రాజశేఖర చక్రవర్తి 4వ ర్యాంకు దక్కించుకున్నాడు. అలాగే పోట్ల ఆనందపాల్ (5), బెల్లి శ్రీచరిత (6), ఆనెం అఖిల్ (7), కల్వకుంట్ల మిథిలేశ్ (8), కాత్యాయన నిఖితైశ్వర్య (9), బత్తుల అరుణ్ కుమార్ (10), శ్రీరామోజు స్ఫూర్తి (11), మహ్మద్ నదీమ్ ఖాన్ (12), అరవ లక్ష్మీ జాహ్నవి (13), పొద్దటూరి ఆశిష్ (14), కామిశెట్టి సూర్యతేజ (15), వి.వినీల్ రెడ్డి (16), భమిడిపాటి నిఖిల్ (17), గుండ్ల ఆదిత్య వర్ధన్ (18), కన్హయ్యా బియానీ (19), యమ్మనూరు ధృవకుమార్ రెడ్డి (20)… టాప్ 20లో నిలిచారు.

అభ్యర్థులు ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.