నాయిని ని ప‌రామ‌ర్శించిన మ‌హ‌మూద్ అలీ, శ్రీ‌నివాస్ గౌడ్, ఎర్రబెల్లి

249
Nayani Narsimha Reddy
- Advertisement -

హైదరాబాద్‌ అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని మంత్రులు మ‌హ‌మూద్ అలీ, శ్రీ‌నివాస్ గౌడ్ తో క‌లిసి రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రామ‌ర్శించారు. నాయిని న‌ర్సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వివ‌రాలు మంత్రి తెలుసుకున్నారు.

మంత్రి నాయిని ఆరోగ్య ప‌రిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. నాయినికి మ‌రింత మెరుగైన చికిత్స అందించాల‌ని అపోలో వైద్యులు, సిబ్బందిని కోరారు. నాయిని న‌ర్సింహారెడ్డి సాధ్య‌మైనంత తొంద‌ర‌లో కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు మంత్రులు.

- Advertisement -