కల్పకవనంను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు‌..

252
ministers
- Advertisement -

గురువారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపాలిటీ సంగపూర్ వద్ద కల్పకవనం అర్బన్ పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్ శోభ, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పిచైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..7 నర కోట్ల రూపాయలతో చక్కటి అర్బన్ పార్క్ ని నిర్మించుకుని, ప్రారంభించుకున్నాం.పట్టణాలు కాంక్రీట్ జంగల్స్ గా మారిపోతున్నాయని ఆలోచన చేసి దేశానికే ఆదర్శంగా 36 వ అర్బన్ పార్క్ ని ప్రారంభించుకున్నామన్నారు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వన బోజనాలను, పిల్లలతో విహార యాత్రలకు రండి ఇది మీ కోసమే అని మంత్రి హరీష్‌ కోరారు.మొక్కలు నాటడం మన భవుష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడమే అని.. ఎంత ఆస్తిని ఇచ్చామనేది కాదు చక్కటి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళం కావాలి అని మంత్రి తెలిపారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. 292.5 ఎకరాల భూమిలో 7 నర కోట్ల రూపాయలతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశాం. తక్కువ సమయంలో రాష్ట్రంలో 4 శాతం అడవుల పునరుద్ధరించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల నశించిన అడవులు పునరుద్ధరణ జరిగిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెళ్లువాడుతున్నాయి.మల్లన్నసాగర్ ,కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల వల్ల ఈ జిల్లాకు నీరు కూడా అందనుంది. 2వందల ముప్పై కోట్ల మొక్కలను నాటితే 70 శాతం పెంచగలిగామని మంత్రి తెలిపారు. సిద్దిపేట చారిత్రాత్మక జిల్లా. మంత్రి హరీష్ రావు చొరవతో జిల్లాలో ఇంత చక్కటి అభివృద్ధి జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రజలు ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకి వెళుతున్నారు. భారత దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. ప్రపంచం అంత తెలంగాణ వైపు చూస్తోంది. రేపటి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కేసీఆర్ మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారు. ఈ అర్బన్ పార్కులో మూషిక జింకలను సైతం అటవి శాఖ అధికారులు పెంచాలి అని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు.

https://twitter.com/TrsHarishNews/status/1357311264309923843
- Advertisement -