పొరపాటున కూడా ఈ లింక్‌‌ను ఓపెన్‌ చేయకండి..!

229
fake Valentine's Day gifts
- Advertisement -

ఇటీవల సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పుడు మరోసారి వీరు కొత్త పథకం వేశారు. మరి కొద్ది రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రానుంది. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు ప్రముఖ కంపెనీల పేరుతో ప్రకటనలు వదులుతూ.. బాధితులను ఆకర్షిస్తున్నారు. ప్రత్యేకంగా గిఫ్ట్‌ల కోసం నెట్‌లో అన్వేషించే ప్రేమికుల జేబులు కాళీ చేయడానికి ప్లాన్ వేశారు. ఇందుకు ఏకంగా అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ‘టాటా’ పేరునే వాడుకుంటున్నారు. ప్రజలను మోసం చేయాలంటే వారికి నమ్మకం కలిగించేలా పెద్దపెద్ద సంస్థల పేర్లను వాడాలన్నదే ఆ కేటుగాళ్ల ఆలోచనగా తెలిసింది. ‘టాటా’ వాలంటైన్స్ డే గిఫ్ట్ పేరుతో వాట్సాప్‌లో ఓ సందేశం వైరల్‌గా మారింది. ఆ లింక్‌ను క్లిక్ చేసినా, షేర్ చేసినా మీతో పాటు మీ సన్నిహితులూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆ లింక్ క్లిక్ చేసే వారిలో ఫోన్‌లో వారి బ్యాంకు ఖాతా వివరాలు భద్రపరుచుకును ఉంటే వాటిని తస్కరించేలా మాయగాళ్లు ఆ వెబ్ లింక్‌ను సృష్టించినట్టు తెలిసింది. ఆ లింక్ క్లిక్ చేసి.. వారికి బ్యాంకు వివరాలు తెలిస్తే ఖాతా ఖాళీ కావడం ఖాయమని, పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ట్విట్టర్‌లో ప్రచారం చేస్తోంది. సైబర్ క్రైమ్స్ వింగ్ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో ఈ మోసాలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ‘అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, మరి ఎవరో గిఫ్ట్ ఇస్తాడు అంటే ఎలా నమ్ముతారని’ ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా సైబరాబాద్ పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

- Advertisement -