మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్

305
talasani

త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందన్నారు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ ఎట్టీ పరిస్ధితుల్లో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. ఎంఐఎం తమకు మిత్రపక్షం మాత్రమే అని ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ భావాలున్న పార్టీ అని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు కుల మతాలను రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. మన్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం అద్భుతంగా జరుగుతుందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులు గెలిస్తే నగరాలు అభివృద్ది చెందుతాయన్నారు.