కంటోన్మెంట్ రూపురేఖలు మారుస్తాం: తలసాని

242
talasani srinivas
- Advertisement -

కంటోన్మెంట్ అభివృద్దే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మీడియాతో మాట్లాడిన వారు ..గతంలో ఎలా ఉండే అన్న దానిపై రివ్యూ చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న వారికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో కంటోన్మెంట్ లో ఉండే ప్రజలకు అవి వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం..ఆర్థిక శాఖ మంత్రి తో మాట్లాడి నెలకు పది కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది..త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం..బోర్డ్ మెంబర్స్,వార్డు మెంబర్స్ ప్రజల మధ్య ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి..కంటోన్మెంట్ లో రెవెన్యు పెంచుకునే సోర్స్ చాలా ఉందన్నారు.

ఆ దిశగా బోర్డ్ మెంబర్స్ ,అధికారులు దృష్టి సారించాలి..మా దృష్టి కి తీసుకువస్తే సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తాం..కంటోన్మెంట్ భూములు అక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.మల్లారెడ్డి తాను ఇద్దరం కంటోన్మెంట్ లోనే ఉంటాం..ఇది కేంద్రం ఆధీనంలో ఉంటుంది..ఒకప్పుడు జీహెచ్‌ఎంసీ కంటే బాగుంటుండే..నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి సమస్యల పై పార్లమెంట్ లో ప్రత్యేకంగా పోరాడిన..ఇప్పుడు ప్రతి వార్డు కి ప్రత్యేక నిధులు ఇస్తున్నాం అన్నారు.

కంటోన్మెంట్ రూపురేఖలు పూర్తిగా మారుతాయి..కంటోన్మెంట్ లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,కల్యాణ లక్ష్మీ పథకం ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తాం..సీఎం కేసీఆర్ ఇక్కడి పేద ప్రజలకు అండగా నిలబడతారని చెప్పారు.

- Advertisement -