‘12 o క్లాక్‌’తో భయపెడుతున్న ఆర్జీవీ

364
rgv
- Advertisement -

లాక్ డన్, కరోనా నేపథ్యంలో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే కరోనా, క్లైమాక్స్‌,నగ్నం,మర్డర్, నగ్నం వంటి సినిమాలను తెరకెక్కించిన ఆర్జీవీ క్లైమాక్స్, నగ్నం సినిమాలను శ్రేయాస్ ఈటీలో విడుదల చేశారు.

తాజాగా ’12 O క్లాక్’ అనే పేరుతో ఓ హారర్ సినిమాని అనౌన్స్ చేశాడు వర్మ. ఆర్జీవీ మార్క్‌కు ఏమాత్రం తీసిపోకుండా విడుదల చేసిన టీజర్‌ అందరిని ఆకట్టుకుంటోంది. కంపెనీ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఆర్జీవీ తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇది షార్ట్ ఫిల్మ్ కాదని 1 గంట 45 నిముషాలు ఉండే ఫుల్ లెన్త్ సినిమా అని వర్మ తెలిపాడు. త్వరలో మర్డర్, పవర్ స్టార్ సినిమాలను సైతం త్వరలో విడుదల చేయనున్నాడు వర్మ.

- Advertisement -