మొక్కలు నాటిన హీరో అల్లు శిరీష్..

38
alllu sirish

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు హీరో అల్లు శిరీష్‌.హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటారు హీరో అల్లు శిరీష్‌.

త‌న పెర‌డులో మూడు మొక్కలు నాటారు. ఆ త‌ర్వాత వాటికి నీళ్ళు ప‌ట్టారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం చేపట్టిన కార్యక్రమంలో త‌న‌ని భాగ‌స్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు శిరీష్‌.

ఈ ఛాలెంజ్‌ని త‌న మేన‌ల్లుడు, మేన‌కోడ‌ళ్ళు అర్నవ్, అన్విత , సమారా, నివృత్తికి విసిరారు. నేటి బాల‌లే రేప‌టి పౌరులు కాబ‌ట్టి ఈ ఛాలెంజ్‌ని వారికి విసిరాన‌ని శిరీష్ పేర్కొన్నాడు.