మంత్రి తలసానితో ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ వెబ్ సైట్ లాంచ్..!

291
minister talasani
- Advertisement -

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో 1.5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. లేటెస్ట్ గా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ వెబ్ సైట్ ను తెలంగాణ సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణమంత్రి మల్లారెడ్డి,తలసాని సాయి, చిత్ర నిర్మాత కె.శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబందించిన అన్ని వివరాలను ఆ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

talasani

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

talasani sai kiran

Sudigaali Sudheer who is quite popular with TV shows like Jabardasth, Dhee, Pove Pora is starring as a hero in a film titled ‘Software Sudheer’

- Advertisement -