మరోసారి ఒకే వేదికపై గవర్నర్‌,మాజీ ఎంపీ కవిత

411
mp kavitha

తోటి వారికి సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు గవర్నర్ తమిళి సై. రాజ్‌ భవన్‌లోని దర్బార్ హాల్‌లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ మాజీ ఎంపీ కవిత అధ్యక్షతన జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్…స్కౌట్స్ ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్దంగా ఉండటమేనన్నారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్ మెరుగుపడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం సైతం ఎంతగానో తొడ్పడిందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ సగటు సంఖ్యా శాతం పెరిగి దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిందిని గుర్తుచేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి సంస్థలను పూర్తి సేవాభావంతో ఉన్న వారు మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించాలని,ఆడవారిని గౌరవించాలని,నీతి,నిజాయితీతో ఉండాలని పిలుపునిచ్చారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో మరింత మందిని భాగస్వాములను చేయాలన్నారు.

 Bharat Scouts

ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ డిటైల్డ్ రిపోర్టును ప్రవేశపెట్టారు కమిషనర్‌, మాజీ ఎంపీ కవిత. ఖమ్మం,నిజామాబాద్,కరీంనగర్ ఇతర జిల్లాల రిపోర్టును వివరించారు. జిల్లాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సొంత బిల్డింగ్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు విజయ కుమార్,విజయేంద్ర బోయితో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అంతకముందు ఎంపిక చేసిన స్కౌట్స్‌ అండ్ గైడ్స్ సభ్యులకు మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు గవర్నర్ తమిళిసై.

The Bharat Scouts & Guides of Telangana State Association State Council Meeting held at Darbar Hall, Raj Bhavan here on today.
 Bharat Scouts