BCCI ని కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి.. మంత్రి తలసాని డిమాండ్‌..

238
- Advertisement -

ఇండియాలో ఎక్కువ ప్రజాదరణ ఉన్న గేమ్ క్రికెట్ అని, దీని వల్ల బీసీసీఐకి కోట్లలో టర్నోవర్ వస్తుందని, బీసీసీఐని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని దాని ద్వారా మిగిలిన గేమ్స్ ఆడేవారికి ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేశారు మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.. తలసాని యూవసేన ఆధ్వర్యంలో అమీర్పేట్ జిహెచ్ఎంసి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మొదటి ప్రయారిటీ బాగా చదవడం అని, దాని తర్వాత గేమ్స్ ఆడటం అని, కరోన లాంటి వైరస్‌ను ఎదుర్కోవాలంటే మంచి ఆహారంతో పాటు గేమ్స్ ఆడటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చన్నారు. కానీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం క్రికెట్ కి మాత్రమే ఆదరణ కల్పించడమే కాకుండా ఇతర క్రీడకారులకు ప్రభుత్వం తరపున ప్రోత్సహకం అందించే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ ఆటగాళ్లుగా ఎదుగుతారని మంత్రి అభిప్రాయపడ్డారు. 3 రోజులు జరిగే ఈ టోర్నమెంట్‌లో 75 క్రికెట్ టీమ్స్, 15 కబడ్డీ టీమ్స్ పోటీలో పాల్గొననున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో పోటీలో పాల్గొనే ప్రతి టీమ్‌కు క్రికెట్ కిట్ అందిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.

- Advertisement -