టూరిజం అభివృద్ధికి మరింత కృషి: శ్రీనివాస్ గౌడ్

166
sriniva goud

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు పర్యాటక శాఖ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో (HCVB) నిర్వహించే MICE టూరిజం పై ప్రదానంగా చర్చించారు.కోవిడ్ – 19కు ముందు హైదరాబాద్ సిటీకి ఉన్న బ్రాండింగ్ వల్ల గ్లోబల్ కాన్ఫెరెన్సు లకు వేదికగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అంతర్జాతీయ స్థాయి మీటింగ్ లను, కాన్ఫెరెన్సు లను మరియు ఎగ్జిబిషన్ లను నిర్వహించామన్నారు.

హైదరాబాద్ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరం ను అభివృద్ధి చేయటం వల్ల నేడు IT, ఫార్మ్ ఎగుమతులకు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య కేంద్రంగా మారిందన్నారు.హైదరాబాద్ నగరం కు ఉన్న బ్రాండింగ్ ను దృష్టిలో పెట్టుకొని MICE (Meetings, Incentives,Conferences, Exhibitions) టూరిజం అభివృద్ధి కి చర్యలను చేపట్టు తున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ MICE టూరిజం ప్రపంచంలో గొప్ప నగరాలైన లండన్, ప్యారిస్, న్యూయార్క్, సిడ్నీ, బీజింగ్, టోక్యో మరియు దుబాయ్ లాంటి నగరాల సరసన హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు.

ఇప్పటికే పురపాలక, పరిశ్రమల మరియు IT శాఖల మంత్రి KT రామారావు అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు.హైదరాబాద్ నగరం ను గ్లోబల్ సిటీ గా రూపొందించటం లో పర్యాటక శాఖ తన వంతుగా MICE టూరిజం ను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్. MICE టూరిజం అభివృద్ధి కి తగిన ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు,టూరిజం MD మనోహర్, HCVB CEO జలీల్ (గ్యారీ) ఖాన్, HCVB హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇయాన్ దుబిర్ మరియు మేనేజర్ పార్వతి భాయి లు పాల్గొన్నారు.