CM KCR:బుద్ధిజం పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ కృషి

24
- Advertisement -

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక , పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక రాజధాని కొలంబోలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా జెటవనారమయ – అనురాధపుర లో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రం ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బౌద్ధ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తో ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మికవేత్త నాగార్జునుడు నడియాడిన కేంద్రమైన విజయపురి (నేటి నాగార్జునసాగర్) లో సుమారు 200 ఎకరాలలో 100 కోట్ల రూపాయల నిధులతో బుద్ధ వనంను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారన్నారు. బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం కొలువైందని మంత్రి సందర్భంగా వెల్లడించారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలను బౌద్ధ సంస్కృతి పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి పై రూపొందించిన సావనిర్ ను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల, బాదంకుర్తి, ఫణిగిరి, నేలకొండపల్లి లాంటి ప్రాంతాలలో బుద్ధిజం ఎంతో వైభవాన్ని చాటిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బుద్ధిజం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా బుద్ధవనం ప్రాజెక్టు ను రూపకల్పన చేసి బుద్ధిజం అభివృద్ధికి , బౌద్ద ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న బుద్ధిజం కేంద్రాలను పరిరక్షిస్తూ వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా , బౌద్ధ విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించాలని మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకులకు పిలుపునిచ్చారు.

Also Read:రక్షిత్ అట్లూరి…నరకాసుర

ఈ కార్యక్రమంలో తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకులు నవీన్ గుణవర్దనే , డాక్టర్ శివనాగిరెడ్డి, ప్రముఖ నటులు గగన్ మాలిక్, డా. మౌనిక సిరివర్ధన, శ్రీలంక దేశ బౌద్ధ ఆధ్యాత్మికవేత్తలు , శ్రీలంక దేశ ఉన్నతాధికారులు, పాల్గొన్నారు.

- Advertisement -