‘ఆర్ఆర్ఆర్’.. చరణ్ న్యూ లుక్‌ అదిరింది..

158
- Advertisement -

ఎన్టీఆర్-రాంచరణ్ ప్రధాన పాత్రలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలుగా, అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రధారులుగా కనిపించనున్నారు. జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమురం భీమ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్‌చరణ్‌ లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా,కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పాటలకు మంచి ఆదరణ లభించింది.

- Advertisement -