సర్ ఛార్జిలతో సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం-నిరంజన్ రెడ్డి

475
Minister Singireddy Niranjan Reddy
- Advertisement -

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్శిటీ, కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంటు, రైల్వే లైన్లు వంటి వాటికి కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం శోచనీయం అన్నారు.

జీఎస్డీపీ పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నప్పటికి తెలంగాణ అభివృద్ఝికి దోహదపడే అంశాలలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఫెడరల్ స్ఫూర్థికి విరుద్దం. నీతిఅయోగ్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.25 వేల కోట్ల సిఫార్సులను పక్కకుపెట్టడం నీతిఅయోగ్ ఉనికినే ప్రశ్నార్ధకం చేసినట్లుగా ఉంది.

దేశం గర్వించదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ , పాలమూరు – రంగారెడ్డికి గానీ ఎలాంటి కేటాయింపులు గానీ, జాతీయహోదాగానీ ఇవ్వకపోవడం బాధాకరం. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు ఒక రూపాయి సర్ ఛార్జి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరవడమే అన్నారు. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్న ప్రధానమంత్రి వాగ్దానానికి తగినట్లు వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఏ కోశానా ఉన్నట్లులేదని మంత్రి వ్యాఖ్యానించారు.

- Advertisement -